ప్రభాస్ హీరోగా 2012లో వచ్చిన 'రెబెల్' మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రీతిలో ఆడలేదు. రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రభాస్ తండ్రిగా రెబల్‌స్టార్ కృష్ణంరాజు నటించారు. ఇందులో మెయిన్ హీరోయిన్‌గా తమన్నా, సెకండ్ హీరోయిన్‌గా దీక్షా సేథ్ చేశారు. అయితే తమన్నా కంటే ముందు మెయిన్ హీరోయిన్‌గా అనుష్కను అనుకున్నాడు లారెన్స్.
అప్పటికే వచ్చిన 'బిల్లా' సినిమాలో ప్రభాస్, అనుష్క జోడీ, వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ జనానికి బాగా నచ్చేసింది. ప్రభాస్ లాంటి ఆజానుబాహుడికి ఒడ్డూ పొడుగూ ఉన్న అనుష్క సరైన జోడీగా అందరూ ప్రశంసలు కురిపించారు. అందుకే 'రెబల్'లో ఆమెను హీరోయిన్‌గా ఊహించుకున్నాడు లారెన్స్. కానీ ఆ టైమ్‌లో అనుష్కకు కాల్షీట్ల సమస్య ఎదురవడంతో మరో తారను తీసుకోక తప్పలేదు. అలా ఆమె ప్లేస్‌లో తమన్నా వచ్చిందని అప్పట్లో ప్రచారంలోకి వచ్చింది. ఏదేమైనా బాక్సాఫీస్ దగ్గర 'రెబల్' సరిగా ఆడలేదు. అయితే ఆ తర్వాత ప్రభాస్-తమన్నా జోడీ 'బాహుబలి' మూవీతో ప్రేక్షకుల్ని రంజింపచేసింది.
'రెబల్' సినిమా తర్వాత కొరటాల శివను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ, 'మిర్చి' మూవీని అంగీకరించాడు ప్రభాస్. అందులో నాయికగా అనుష్కను ఊహించుకున్నాడు శివ. 'రెబల్'లో చేయలేకపోయిన అనుష్క, 'మిర్చి' మూవీకి తన డేట్స్‌ను అడ్జస్ట్ చేసింది. ఆ మూవీలో ప్రభాస్-అనుష్క జోడీ ఎంతగా ఆడియెన్స్‌ను అలరించిందో చెప్పాల్సిన పనిలేదు కదా!